English   

జగపతి బాబు ఎవరితో అయినా గొడవ పడ్డారా ? అసలు ఎందుకు తప్పుకున్నారు ?

Jagapathi
2019-07-20 11:22:41

గత కొద్దిరోజుగా మహేష్ సినిమా నుండి సీనియర్ యాక్టర్ జగపతి బాబు తప్పుకుంటున్నారు అని, వార్తలు తెగ ప్రచారం అయ్యాయి. అయితే ఎన్నడూ లేనిది ఈ విషయం మీద ఆయన ఒక వీడియో ద్వారా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. గత 33 ఏళ్లుగా ఇండస్ట్రీలో తనకు ఈ పరిస్థితి రాలేదని  తొలిసారి స్పందించాల్సి వచ్చిందంటూ ఒక ఎమోషనల్ వీడియో పోస్ట్ చేశారు. సినిమా అనేది తన ఫ్యామిలీ లాంటిదని చెప్పిన ఆయన తన ఫ్యామిలీ విషయం బయట మాట్లాడటం ఇష్టం లేదు కానీ ఒక క్లారిఫికేషన్ ఇవ్వక తప్పలేదని పేర్కొన్నారు. అనిల్ రావిపూడి, మహేష్ బాబుల సరిలేరు నీకెవ్వరూ సినిమా నుండి తను తప్పుకున్నట్టు రకరకాల పుకార్లు వస్తున్నాయని అవి నిజం కాదని ఆయన చెప్పుకొచ్చారు. ఆ సినిమాలోని క్యారెక్టర్ అంటే చాలా ఇష్టమని ఆ క్యారెక్టర్ చేయడానికి ఇప్పటికీ రెడీగానే ఉన్నానని చెప్పుకొచ్చారు. ఆ సినిమాకోసం నేను రెండు సినిమాలు కూడా వదులుకున్నాన్ని కానీ కొన్ని కొన్ని సందర్భాల్లో కొన్ని తప్పవని ఇండస్ట్రీలో ఇలాంటివి జరుగుతుంటాయని చెప్పుకొచ్చారు, అలాంటి కొన్ని ప్రత్యేక సందర్భాల వలన ఆ సినిమాలో నేను లేనని ఆల్ ది బెస్ట్ యూనిట్ అని ప్రకటించారు జగపతిబాబు. అయితే జగపతి బాబు ట్వీట్‌పై సరిలేరు నీకెవ్వరు దర్శకుడు అనీల్ రావిపూడి స్పందిస్తూ అర్ధం చేసుకున్నందుకు థాంక్స్ సార్.. ఎప్పటికీ మీరంటే గౌరవం అని ట్వీట్ చేశారు. ''సరిలేరు నీకెవ్వరు'లో ఓ పాత్ర జగపతిబాబుగారికి బాగా నచ్చింది. ఆయన ఆ పాత్ర చేయాలనుకున్నారు. ఆయన వాకౌట్ చేయలేదు. కొన్ని అనివార్య కారణాల వల్ల మేమే దాన్ని సాధ్యం చేయలేకపోయాం. జగపతిబాబుగారితో కలిసి మరో సినిమా చేయడం కోసం ఎదురుచూస్తున్నా. పరిస్థితుల్ని అర్థం చేసుకుని, ేస్నహపూర్వకంగా వ్యవహరించినందుకు మీకు చాలా థ్యాంక్స్‌ సర్‌'' అని అనిల్‌ రావిపూడి ట్విటర్‌లో పేర్కొన్నారు. అలాగే సినిమా తొలి షెడ్యూల్‌ కశ్మీర్‌లో పూర్తయిందనీ, ఈ నెల 26 నుంచి తదుపరి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో మొదలవుతుందనీ ఆయన ప్రకటించారు. అనిల్ ట్వీట్‌పై స్పందించిన జగపతి బాబు థాంక్ యు ఫర్ ది క్లారిఫికేషన్ అంటూ స్పందించారు జగపతిబాబు. అయితే అసలు ఆ అనివార్య కారణాల వలన అంటున్నారు కానీ ఆ అనివార్య కారణాలు ఏమై ఉంటాయా ? అనేదే అర్ధం కావడం లేదు. జగపాతి బాబు ఎవరితో అయినా గొడవ పడ్డారా ? అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
 

More Related Stories