English   

కోన వెంకట్ దర్శకుడిగా ఎందుకు మారలేదు..

kona venkat
2020-03-31 14:12:39

కోన వెంకట్ ఇండస్ట్రీకి వచ్చింది నిర్మాతగా.. కానీ ఆ తర్వాత ఏమేం చేయాలో అన్నీ చేసాడు. రైటర్ నుంచి కో ప్రొడ్యూసర్ గా మారి.. చివరికి నిర్మాతగా సెటిల్ అయ్యాడు. ఇప్పుడు కూడా అనుష్క నిశ్శబ్ధం సినిమాకు నిర్మాతగా ఉన్నాడు. అయితే ఇన్ని చేసినపుడు ఎందుకు దర్శకుడిగా మారలేదు ఈయన.. ఇదే అనుమానం చాలా మందికి వచ్చింది కూడా. అయితే కోన వెంకట్ ఓ సినిమాకు దర్శకుడిగా ఉన్నాడు. నేను తను ఆమె అని అప్పట్లో ఈయన ఓ సినిమా తెరకెక్కించాడు. మాధవన్, సదా, సునీల్, సాయాజీ షిండే, షమితా శెట్టిని పెట్టి హార్రర్ కామెడీ చేసాడు కూడా. 2008లోనే ఈ చిత్రం పూర్తయింది. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. సినిమాను అమ్మేసిన తర్వాత ఆ డబ్బులు తీసుకుని నిర్మాత పారిపోయాడు. 

దాంతో ఈ చిత్రం తర్వాత ఈయన మళ్లీ డైరెక్షన్ వైపు వెళ్లలేదు. చాలా అవకాశాలు వచ్చినా కూడా ఈయన అటువైపు అడుగేయలేదు. దానికి కారణం వర్మ అంటున్నాడు కోన. తాజాగా అలీతో సరదాగా షోకు వచ్చిన కోన.. చాలా విషయాల గురించి చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా దర్శకుడిగా తాను మారడానికి కారణం వర్మ.. ఆపేయడానికి కూడా కారణం వర్మే అని చెప్పాడు. రైటర్ గానే హాయిగా ఉన్నపుడు దర్శకుడిగా వెళ్లాలనిపించలేదని చెప్పాడు కోన వెంకట్. ముఖ్యంగా స్టార్ హీరోలతో పని చేసేటపుడు ప్రెజర్ కూడా ఉంటుందని చెప్పాడు ఈయన. మొత్తానికి దర్శకత్వం తన జీవితంలో చీకటి అధ్యాయం అని చెప్పాడు కోన. 

More Related Stories