English   

సాక్ష్యం బ‌య్య‌ర్లు సేఫ్ అవుతారా..?

will bellankonda srinivas image to get money for sakshyam movie buyers
2018-07-28 10:34:03

ప్ర‌తీసారి భారీ సినిమాల‌తో రావ‌డం.. హై బ‌డ్జెట్ కార‌ణంగా బాగున్న సినిమా కూడా ఫ్లాప్ కావ‌డం కామ‌న్ గా జ‌రుగుతుంది బెల్లంకొండ శ్రీ‌నివాస్ కెరీర్ లో. ఈ సారి కూడా సాక్ష్యం అంటూ మ‌రోసారి భారీ సినిమాతోనే వ‌చ్చాడు. కానీ గ‌త సినిమాల‌తో పోలిస్తే ఈ చిత్రానికి టాక్ వీక్ గా ఉంది. జ‌య జాన‌కీ నాయ‌కా కానీ.. అల్లుడుశీను కానీ పాజిటివ్ టాక్ తోనే ఓపెన్ అయ్యాయి. సినిమాలు బాగున్నాయి అంటూ టాక్ వ‌చ్చిన త‌ర్వాతే ఈ కుర్ర హీర మార్కెట్ క‌నీసం 20 కోట్ల‌కు చేరిపోయింది. అయితే ఈ సారి టాక్ తేడాగా వ‌స్తుంది. దాంతో సాక్ష్యం ఎలా మార‌బోతుంద‌నేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఎంద‌కుంటే ఈ చిత్రం హిట్ అవ్వాలంటే అక్ష‌రాలా పాతిక కోట్లు రావాలి. పెట్టిన బ‌డ్జెట్ కంటే త‌క్కువే అమ్మారు నిర్మాత‌లు.. ఈయ‌న మార్కెట్ దృష్టిలో పెట్టుకుని 10 కోట్లు త‌క్కువ‌కే సినిమాను డిస్ట్రిబ్యూట‌ర్ల చేతుల్లో పెట్టారు.

బెల్లంకొండ‌కు కూడా కొద్దోగొప్పో మాస్ ఫాలోయింగ్ ఉంది కాబ‌ట్టి సాక్ష్యంతో 25 కోట్లు తీసుకొస్తాడ‌నే న‌మ్ముతున్నారు బ‌య్య‌ర్లు. కానీ టాక్ చూస్తుంటే వాళ్ల‌లో భ‌యం మొద‌లైంది. కాన్సెప్ట్ అద్భుతంగా ఉన్నా.. దాన్ని ప్రేక్ష‌కుల‌కు క‌న్విన్సింగ్ గా చెప్ప‌డంలో విఫ‌లం అయ్యాడు ద‌ర్శ‌కుడు శ్రీ‌వాస్. యాక్ష‌న్ సీక్వెన్సుల‌కు తోడు ఆర్ఆర్ అదిరిపోయినా.. క‌థ‌నం విష‌యంలో ఇంకాస్త జాగ్ర‌త్త‌గా ఉంటే బాగుండు అంటున్నారు. ఈ వారం మ‌రే సినిమా లేదు కాబ‌ట్టి సాక్ష్యంకు ఓపెనింగ్స్ వ‌స్తాయి. కానీ అది నిల‌బ‌డుతుందా లేదా అనేది మాత్రం మ‌రో మూడు రోజుల్లో తేలిపోనుంది.

More Related Stories