English   

నోటి దురదకు చెల్లించుకోక తప్పదు భారీ మూల్యం !

Will not cast Radha Ravi in any of our films says KJR Studios
2019-03-25 12:58:17

ప్రముఖ స్టార్ నటి నయనతార మీద నోటి దురదతో అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళ సీనియర్ నటుడు రాధారవికి ప్రముఖ నిర్మాణ సంస్థ కేజేఆర్ స్టూడియోస్ సంస్థ భారీ షాకిచ్చింది. ఇకపై ఆయనను తమ సినిమాలకు తీసుకోబోమని ఆ సంస్థ ప్రకటించింది. అంతేకాదు, ఆయనతో కలిసి పనిచేయవద్దని ఇతర నటీనటులను, నిర్మాణ సంస్థలను కోరింది ఆ సంస్థ. అయితే తాజాగా నయనతార నటించిన ఐరా సినిమాని ఈ సంస్థే నిర్మించడం గమనార్హం. ఓ సినిమా ట్రైలర్ రిలీజ్ కి వెళ్లి అదే సినిమాలో మెయిన్ లీడ్ మీద అలాంటి అసందర్భపు వ్యాఖ్యలు చేస్తుంటే కార్యక్రమానికి హాజరైన వారు నవ్వుతూ చప్పట్లు కొట్టడం బాధాకరమని కేజేఆర్ స్టూడియోస్ పెర్కొన్నది. రాధారవి వ్యాఖ్యలను నడిగర్ సంఘం గుర్తించే ఉంటుందని, ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటుందనే ఆశిస్తున్నట్టు సదరు సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. రాధారవి వ్యాఖ్యలపై కోలీవుడ్ నటులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఓ సీనియర్ నటుడు మాట్లాడాల్సిన మాటలు ఇవేనా ఆయన సీనియారిటీ ఇదేనా అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

More Related Stories