English   

ఎన్టీఆర్ ను ఒప్పించే స‌త్తా చ‌ర‌ణ్ కు ఉందా..? 

NTR-charan
2018-09-24 16:25:08

ఎన్టీఆర్.. రామ్ చ‌ర‌ణ్ ఇప్పుడు బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు. ప్ర‌తీ చిన్న విష‌యాన్ని షేర్ చేసుకుంటున్నారు. పైగా ఇద్ద‌రూ క‌లిసి రాజ‌మౌళి సినిమాలో న‌టించ‌బోతున్నారు కూడా. ఇదిలా ఉంటే ఇప్పుడు చ‌ర‌ణ్ ఓ విష‌యాన్ని ఎన్టీఆర్ కు చెప్పాల‌ని.. ఆ విష‌యాన్ని ఒప్పించాల‌ని తెగ ట్రై చేస్తున్నాడు. దానికి ఎన్టీఆర్ ఏమంటాడు అనే టెన్ష‌న్ కూడా ఉంది. ప్ర‌స్తుతం అర‌వింద స‌మేత‌తో బిజీగా ఉన్నాడు ఎన్టీఆర్. కొన్ని రోజులుగా ఇది త‌ప్ప మ‌రో ధ్యాసే లేదు ఈ హీరోకు. ఇక చ‌ర‌ణ్ కూడా బోయ‌పాటి సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ను త‌న సినిమాలో ముఖ్య పాత్ర‌లో న‌టింప‌చేయాల‌ని చూస్తున్నాడు మెగా వార‌సుడు. 

త‌న సినిమా అంటే బోయ‌పాటి సినిమా కాదు.. సైరా. దీనికి నిర్మాత రామ్ చ‌ర‌ణ్ కాబ‌ట్టి అది త‌న సినిమానే. చిరంజీవి హీరోగా వ‌స్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ ను ఓ పాత్ర కోసం అడుగుతున్నాడ‌ని తెలుస్తుంది. దీనికి ఇంకా జూనియ‌ర్ నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. అయిన ఇప్పుడు ఎన్టీఆర్ చాలా బిజీగా ఉన్నాడు. అర‌వింద స‌మేత పూర్తైన వెంట‌నే రాజ‌మౌళి కోసం సిద్ధం అవ్వాల్సి ఉంటుంది. మ‌రోవైపు చ‌ర‌ణ్ కూడా అంతే. ఇలాంటి టైమ్ లో చ‌ర‌ణ్ సినిమాలో ఎన్టీఆర్ న‌టిస్తాడా అనేది అనుమాన‌మే. ఏమో చూడాలిక‌.. ఇక్క‌డ రిలేష‌న్స్ కోసం ఏదైనా జ‌ర‌గొచ్చు. అలా జ‌రిగితే మాత్రం సైరాకు ఇంకా బూస్ట‌ప్ వ‌చ్చిన‌ట్లే. 
 

More Related Stories