English   

త్రివిక్ర‌మ్ పై కుట్ర జ‌రుగుతుందా..?

Will the conspiracy on Director Trivikram in the industry
2018-08-11 06:50:59

త్రివిక్ర‌మ్ పై కుట్రా.. ఆయ‌న‌పై ఎందుకు కుట్ర చేస్తారు.. అయినా ఆయ‌న ఎవ‌ర్నీ ఏమీ అన‌డు అలాంటి ద‌ర్శ‌కుడిపై కుట్ర చేయాల్సిన ప‌నేం ఉంది అనుకుంటున్నారా..? మీరు ఊహించింది నిజ‌మే.. కానీ ఇప్పుడు జ‌రుగుతున్న కొన్ని ప‌రిస్థితులు చూసిన త‌ర్వాత ఖచ్చితంగా త్రివిక్ర‌మ్ పై ఎవ‌రో కావాల‌నే కుట్ర చేస్తున్నారేమో అనిపించ‌క మాన‌దు. పైగా ఇది ఇప్ప‌టిది కూడా కాదు.. ఏళ్ల‌నాటి ప‌గ‌లా అనిపిస్తుంది. ఇప్పుడు ఈయ‌న అర‌వింద స‌మేత అంటూ ఫ్యాక్ష‌న్ క‌థే చేస్తున్నాడు. ఎన్టీఆర్ ఇందులో హీరో. ఇందులో హీరోపై ప్ర‌త్య‌ర్థులు ప‌గ‌బ‌ట్టిన‌ట్లే.. త్రివిక్ర‌మ్ సినిమాపై కూడా ప‌గ బ‌ట్టారు కొంద‌రు. లేక‌పోతే మ‌రేంటి.. విడుద‌ల‌కు ముందే అరవింద స‌మేత‌ స్టిల్స్, టీజ‌ర్ స్టిల్స్ ఎడిటింగ్ టేబుల్ మీద నుంచి ఎలా లీక్ అవుతాయి..? వాటికి ఏమ‌న్నా రెక్క‌లున్నాయా.. లేవు క‌దా..? ఖచ్చితంగా ఎవ‌రో ఒక‌రు ఎడిట‌ర్లే లీక్ చేసుండాలి.

త్రివిక్ర‌మ్ సినిమాకు ఇలా జ‌ర‌గ‌డం ఇదే తొలిసారి కాదు. ఖ‌లేజా సినిమా నుంచి ఉంది ఈ తిప్ప‌లు. అప్ప‌ట్లో స‌దాశివ పాట విడుద‌ల‌కు ముందే నెట్లో లీక్ అయిపోయింది. దాంతో ఆ పాట కోసం భారీగా ప్లాన్ చేసుకున్నా.. అవ‌న్నీ కాద‌నుకుని చివ‌రికి చేసేదేం లేక సింపుల్ గా ఆడియో విడుద‌ల చేసారు. ఇక అత్తారింటికి దారేది తిప్ప‌లు గురించి ఏమ‌ని చెప్పాలి. ఈ సినిమా విడుద‌ల‌కు ముందే ఫ‌స్టాఫ్ అంతా నెట్లో ప్ర‌త్య‌క్ష‌మైంది. ఇక అ..ఆకు కూడా టీజ‌ర్ విడుద‌ల‌కు ముందే బ‌య‌టికి వ‌చ్చేసింది. ఇలా కేవ‌లం త్రివిక్ర‌మ్ సినిమాల‌కు మాత్ర‌మే ఎందుకు జ‌రుగుతుంది..? ఎవ‌రో కావాల‌నే ఇదంతా చేయిస్తున్నారా..? ప‌్ర‌తీసారి ఇంటిదొంగే ఇదంతా ఎందుకు చేస్తున్న‌ట్లు..? దీనిపై త్రివిక్ర‌మ్ కూడా శూన్య‌మే స‌మాధానంగా ఉన్నాడు. మ‌రి ఇప్పుడు చెప్పండి.. త్రివిక్ర‌మ్ పై ఇండ‌స్ట్రీలో కుట్ర జ‌రుగుతుందా లేదా..?

More Related Stories