English   

విషెస్ వర్షంలో ఎన్టీఆర్

NTR-trivikram
2018-05-20 17:38:30

సూపర్ స్టార్ నుంచి స్మాల్ వరకూ ప్రతి ఒక్కరూ యంగ్ టైగర్ లుక్ కు ఫిదా అయిపోయారు. అందుకే ఎప్పుడూ సోషల్ మీడియాలో బహిరంగంగా బర్త్ డే విషెస్ చెప్పని వారు కూడా ఈ సారి యంగ్ టైగర్ ను హ్యాపీ బర్త్ డే అంటూ విషెస్ లో ముంచెత్తారు. సోషల్ మీడియాలోనే దాదాపు 70మందికి పైగా స్టార్స్ విషెస్ చెప్పారు. ఇక జనతా గ్యారేజ్ స్టార్ మోహన్ లాల్ కూడా ‘హ్యాపీ బర్త్ డే డియర్ తారక్’ అని ట్వీట్ చేశాడు. ఇక కొందరైతే తారక్ కొత్త సినిమా టైటిల్ అరవింద సమేత వీర రాఘవను ఉటంకిస్తూ.. ‘త్రివిక్రమ్ సమేత ఎన్టీఆర్’ అంటూ ఫన్నీగా పోస్ట్ లు పెడుతున్నారు. ఈ మధ్య వరుస హిట్స్ తో దూసుకుపోతున్నాడు ఎన్టీఆర్. రీసెంట్ మూవీ జై లవకుశలో అతని నటనకు ఎంటైర్ టాలీవుడ్ ఫిదా అయిపోయింది. ఇక మొదటిసారిగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తో సినిమా చేస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ పై భారీ అంచనాలున్నాయి. ఈ ఇద్దరికీ ఓవర్శీస్ లోనూ మంచి మార్కెట్ ఉంది. దీంతో ఇప్పటి నుంచే ఈ సినిమాకు హయ్యొస్ట్ రేట్స్ తో బయ్యర్స్ వస్తున్నారని చెబుతున్నారు. ఏదేమైనా ఈ బర్త్డ్ డే ఎన్టీఆర్ కు స్పెషల్ అనే చెప్పాలి. 

More Related Stories