English   

దండెత్తిన ‘దండుపాళ్యం’ బ్యాచ్

Dandupalya 4

దండుపాళ్యం బ్యాచ్ దండెత్తింది.. ఇది మా దండుపాళ్యం కాదని గొంతెత్తింది. ఈ దండులో మేం లేమని స్పష్టం చేసింది. దండుపాళ్యం...మొదటి సినిమాతో తెలుగు కన్నడలో సంచలనం సృష్టించాడు దర్శకుడు వ్రీనివాసరాజు. కర్ణాటక రాష్ట్రంలో కొన్నేళ్ల క్రితం క్రూరంగా హత్యలు చేసే బ్యాచ్ కథను అత్యంత రియలిస్టిక్ గా తెరకెక్కించిన ఈ దర్శకుడు తెలుగువాడే. దండుపాళ్యం తర్వాత ఏకంగా ఉపేంద్ర కూడా అతనితో ఓ సినిమా చేశాడు. తర్వాత ఆ సినిమాకు సీక్వెల్ చేశాడు. దండుపాళ్యం-2. కానీ ఈ రెండో భాగం పెద్దగా ఆకట్టుకోలేదు. మొదటి పార్ట్ లో ఉన్నన్ని ‘రియలిస్టిక్’ అంశాలు లేకపోవడం ఓ మైనస్ అయితే.. వీళ్లంతా అమాయకులు అనేలా కలరింగ్ ఇచ్చేలా చేసిన ప్రయత్నం మరో మైనస్ అయింది. ఈ నేపథ్యంలో దండుపాళ్యంకు మూడో భాగం సిద్ధం చేశాడు దర్శకుడు. ట్రైలర్ ను బట్టి చూస్తే ఈ సారి మరింత ‘డోస్’ పెంచినట్టు తెలుస్తోంది. తెలుగులో బంద్ ఉంది కానీ.. ఈ సినిమా కన్నడతో పాటు తెలుగులోనూ రేపే విడుదల కావాల్సి ఉంది. 

ఇంత వరకూ బానే ఉన్నా లేటెస్ట్ గా ఈ మూవీకి నాలుగో భాగం అంటూ ఇవాళ హడావిడీ మొదలైంది. దండుపాళ్యం-4 అని. అయితే ఈ సినిమా పోస్టర్స్ చూసిన దండుపాళ్యం బ్యాచ్ దండెత్తింది. ఈ సినిమాలో తాము లేమని.. అసలు తమనెవరూ సంప్రదించలేదనీ.. ఆ బ్యాచ్ లో హాట్ బ్యూటీ పూజాగాంధీ గుస్సా అయింది. పూజతో పాటు దండుపాళ్యంలో కీలక పాత్రలు పోషించిన మకరన్ దేశ్ పాండే, రవికాలే వంటి నటులు కూడా అదే చెప్పారు. ఈ మూవీలో నటించాలని తమనెవరూ అడగలేదనీ.. అయినా తమ ఫోటోస్ పోస్టర్ లో వేయడం కరెక్ట్ కాదని.. ఇందుకు వివరణ ఇవ్వాలని సదరు మేకర్స్ ను డిమాండ్ చేశారు.నిజానికి ఇది ఎవరు చేస్తున్నారో కూడా స్పష్టంగా తెలియదు. కానీ హీరో శ్రీకాంత్ చేతుల మీదుగా నిర్మాత వెంకట్ దండుపాళ్యం-4 అనే పోస్టర్స్ ను రిలీజ్ చేయించాడు. దీంతో చాలామంది ఈసినిమాలో శ్రీకాంత్ నటిస్తున్నాడనుకున్నారు. కానీ గొడవ ఇలా టర్న్ అయ్యేసరికి అసలు విషయం తెలిసింది. మొత్తంగా ఈ మూవీకి నాలుగో భాగం వస్తుందో లేదో కానీ.. నాలుగో భాగం రేంజ్ లో ఒరిజినల్ ప్రొడ్యూసర్ కు ఈ దండుపాళ్యం-4 ప్రొడ్యూసర్ వెంకట్ కు మధ్య వార్ షురూ అయిపోయింది. 

More Related Stories