English   

వరల్డ్ ఫేమస్ లవర్ రివ్యూ

World Famous Lover Review
2020-02-14 14:08:30

టాలీవుడ్ క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా రాశీ ఖన్నా, ఐశ్వర్య రాజేష్, క్యాథరీన్ మరియు ఇజబెలా లీలు హీరోయిన్లుగా కె క్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “వరల్డ్ ఫేమస్ లవర్”. ఈ సినిమాలో నలుగురు హీరోయిన్లు పైగా ముద్దు సీన్లు ఇలాంటివి అన్నీ ఈ సినిమా మీద ఒక రేంజ్ లో అంచనాలు ఏర్పడ్డాయి.  ఎన్నో అంచనాలతో ప్యాన్ ఇండియా సినిమాగా తెరకేక్కిన ”డియర్ కామ్రేడ్” దెబ్బ వేయడంతో ఈ సినిమా హిట్ కావడం విజయ్ కు అవసరం చాలా ఉంది. డియర్ కామ్రేడ్ లానే ఈ సినిమాని కూడా ఇతర భాషల్లో విడుదల చేశారు. ఇక ఈ సినిమా ఏమేరకు అంచనాలను అందుకుంది అనేది చూద్దాం.  

కథ :

కాలేజ్ రోజుల నుంచి గౌతమ్ (విజయ్ దేవరకొండ), యామిని (రాశి ఖన్నా) ప్రేమించుకుంటారు. అయితే యామిని కోటీశ్వరురాలు కావడంతో వారి పెళ్ళికి యామిని తండ్రి ఒప్పుకోడు. వారిద్దరూ లివిన్ లో ఉంటారు. గౌతమ్ కు ఒక రచయిత అవ్వాలనే డ్రీమ్ ఉంటుంది. దానిని సాధించడానికి యామిని కొంత సపోర్ట్ చేస్తుంది. ఇక ఆ తరువాత కొన్ని కారణాల వలన వారిద్దరూ విడిపోతారు. అయితే వారికి శీనయ్య, సువర్ణ అనే ఇద్దరు మధ్య తరగతి భార్యాభర్తలకి అలాగే స్మిత( క్యాథెరిన్) ఇజబెల్ (ఇజా బెల్లె) లకి కధతో ఉన్న సంబంధం ఏమిటి ? గౌతమ్, శీనయ్యలు ఇద్దరా లేక ఒకరా, చివరికి గౌతమ్ యామినిలు కలుసుకున్నారా అనేది వెండి తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ :

ఈ సినిమాని పరిశీలిస్తే విజయ్ గత సినిమాల లానే రొమాంటిక్, ఎమోషనల్ డ్రామా. కథగ ఒక డిఫరెంట్ సబ్జెక్ట్ ని ఎంచుకున్న క్రాంతి మాధవ్, దానిని స్క్రీన్ పై చూపించడంలో మాత్రం చాలా వరకు ఇబ్బంది పడ్డాడు. ముఖ్యంగా   ప్రేమలో త్యాగం ఉంటుంది. ప్రేమలో దైవత్వం ఉంటుందని చెప్పిన దర్శకుడు బ్రేకప్ తర్వాత అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఏ విధమైన మనోవేదన అనుభవిస్తారనేది కళ్ళకి కట్టినట్టు చూపించారు. అయితే నెమ్మదిగా సాగిన కథనం ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ ఎక్కువయిపోవడంతో సినిమా మొదలయినపుడు ఉన్న ఆసక్తి చివరి వరకు కంటిన్యూ చేయలేక పోయారు. ఇక సినిమా ఎక్కడికక్కడ ప్రేక్షకుడి ఊహకు అందే విధంగా ఉండడం మరో మైనస్. ఇక ఇంతకు మునుపు గీత గోవిందం లాంటి అద్భుతమైన ఆల్బమ్స్ ను ఇచ్చిన గోపీ సుందర్ ఈ సినిమాకి మాత్రం పర్లేదని అనిపించాడు. ఒక్క ఇల్లెందు ఎపిసోడ్ మాత్రం గుండెకి హత్తుకునేలా చిత్రీకరించారు.
 
విజయ్ నటన విషయానికి వస్తే ఈ సినిమాలో నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించాడు. కానీ బ్రేకప్ ఎపిసోడ్ 'అర్జున్ రెడ్డి' సినిమాని గుర్తు చేస్తుంది. అయితే నటనా పరంగా ఓకే అనిపించినా కొన్ని చోట్ల కంటిన్యుటీలేని హెయిర్ స్టైల్ తో ఇబ్బంది పెట్టాడు. కథానాయికుల్లో ఐశ్వర్య రాజేష్ అందరికంటే ఎక్కువ మార్కులు కొట్టేసింది.‌ ఇక స్మిత పాత్రలో కేథరిన్, మెయిన్ లీడ్ రాశి ఖన్నాలు పర్లేదనిపించారు. ఇజబెల్లా కూడా పైలెట్ పాత్రకు సూట్ అయింది. గౌతమ్ స్నేహితుడిగా ప్రియదర్శి పాత్ర రెండు మూడు సన్నివేశాలకే పరిమితమైంది. శత్రు, ఆనంద చక్రపాణి, జయప్రకాశ్ లాంటి వాళ్ళు తమ పాత్రలకు న్యాయం చేశారు.

ఫైనల్ : బ్రేకప్ - ప్యాచప్ లు అన్ని సార్లూ వర్కౌట్ కావు !

రేటింగ్: 2.5/5.

More Related Stories