English   

టాలీవుడ్ డైరెక్టర్ ఆత్మహత్యాయత్నం

Rajasimha-Suicide

మోస్ట్ టాలెంటెడ్ రైటర్ గా పేరు తెచ్చుకున్న రచయిత, దర్శకుడు రాజసింహా ఆత్మహత్యాయత్నం టాలీవుడ్ లో సంచలనం సృష్టిస్తోంది. బొమ్మరిల్లు, శంకర్ దాదా ఎమ్.బి.బి.ఎస్ వంటి సూపర్ హిట్ సినిమాలకు కథ మాటలు రాశారు రాజసింహా. చాలాయేళ్ల క్రితమే పరిశ్రమకు వచ్చిన అతను 2012లో ఓ ప్రొడక్షన్ హౌస్ స్థాపించాడు. అది పూర్తిగా నష్టాల్లోకి వెళ్లిపోవడంతో డిప్రెషన్ కు గురయ్యాడు. తర్వాత కొన్నాళ్లకు అల్లు అర్జున్ సాయంతో రుద్రమదేవి చిత్రానికి మాటలు రాసే అవకాశం వచ్చింది. ఇందులో అతని మాటలకు మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. అల్లు అర్జున్ పలికే గమ్మునుండవోయ్ అనే మేనరిజం ఇతను రాసిందే.  రుద్రమదేవి కంటే ముందు సిద్ధార్థ్, శ్రుతి హాసన్ జంటగా వచ్చిన అనగనగా ఒక ధీరుడు చిత్రానికీ మాటలు అందించాడు. అటుపై సందీప్ కిషన్, నిత్యమీనన్ జంటగా అతను ఒక్క అమ్మాయి తప్ప అనే చిత్రాన్ని డైరెక్ట్ చేశాడు. ఇది కూడా ఫ్లాప్ అయిం. దీనికి తోడు రచయితగానూ కెరీర్ ఆశించినంత గొప్పగా లేదు. దీంతో  మరింత డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. ఒక యేడాది కాలంగా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైన రాజసింహా ఇవాళ మధ్యాహ్నం ముంబై హై డోస్ స్లీపింగ్ పిల్స్ మింగారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతోంది. జీవితంలో ఒకే వృత్తిని నమ్ముకుని ఉండటం కూడా కరెక్ట్ కాదు. వచ్చిన పని, నచ్చిన పని అన్న తర్వాత కొన్ని ఎగుడుదిగుళ్లుంటాయి. అవి తట్టుకుంటేనే అందలం ఎక్కుతారు. ఏమాత్రం తొందరపడ్డా జీవితమే చేజారుతుంది. రాజసింహా జీవితం అలా చేజారకూడదని కోరుకుందాం.. 
 

More Related Stories