English   

XXX ట్రైల‌ర్.. అంతా బూతే..

Ekta Kapoor's XXX Uncensored Trailer Released
2018-09-20 23:29:11

బాలీవుడ్ సిగ్గు విడిచి చాలా కాల‌మైపోయింది. అక్క‌డ సినిమాల్లో.. వెబ్ సిరీస్ ల‌లో బూతు సీన్లు పెంచేసి చాలా కాల‌మైంది. అస‌లు సిగ్గు అనే ప‌ద‌మే లేకుండా రెచ్చిపోవ‌డం ఇప్పుడు ద‌ర్శ‌క నిర్మాత‌ల వంతు. స‌న్నీలియోన్ లాంటి వాళ్లు వ‌చ్చి ఇండియాలో తిష్ట వేసిన‌పుడే బాలీవుడ్ అన్నింటికీ సిద్ధం అని ప్ర‌క‌టించింది. ఇప్పుడు దీనికి కొన‌సాగింపుగా మ‌రో సంచ‌ల‌న వెబ్ సిరీస్ వ‌చ్చింది. పైగా దీనికి నిర్మాత ఎవ‌ర‌నుకున్నారు.. బాలీవుడ్ సెక్స్ సినిమాల స్పెష‌లిస్ట్ ఏక్తా క‌పూర్. ఇండియాలో సెక్స్ అనేది ఓ బిజినెస్ అని.. దాన్ని అమ్ముకోవ‌డంలో త‌ప్పేం లేద‌ని చెబుతుంది ఈ భామ‌. అన్న‌ట్లుగానే త‌న ఆల్ట్ బాలాజీలో ఇలాంటి బూతు సీరియ‌ల్స్ ప్ర‌మోట్ చేస్తూ ఉంటుంది.

ఇప్పుడు బాల‌య్య పైసావ‌సూల్ ఫేమ్ కైరాద‌త్ కీల‌క పాత్ర‌లో ట్రిపుల్ ఎక్స్ ట్రైల‌ర్ వ‌చ్చింది. ఇది చూసిన త‌ర్వాత అస‌లు బాలీవుడ్ వాళ్ల‌కు సిగ్గు ఉందా అనే అనుమానం వ‌స్తుంది. చూసిన త‌ర్వాత లేదు అనే క‌న్ఫ‌ర్మేష‌న్ కూడా వ‌స్తుంది. అస‌లు ఈ రోజుల్లో సెన్సార్ ఉంటేనే ర‌చ్చ రంబోలా చేస్తున్నారు.. ఇక సెన్సార్ లేక‌పోతే ఆ వెబ్ సీరీస్ లు ఎలా ఉంటాయో ఒక్క‌సారి ఊహించుకోండి. ఇప్పుడు ట్రిపుల్ ఎక్స్ ట్రైల‌ర్ కూడా ఇలాగే ఉంది. అస‌లు మాట‌ల్లో చెప్ప‌లేని విధంగా బూతుతో నింపేసారు ట్రైల‌ర్ ను. దాన్ని చెప్ప‌డం ఎందుకు.. చూసి ఒక్క‌సారి మీరే త‌రించండి.

More Related Stories