English   

 య‌ద్ధ‌న‌పూడి క‌న్నుమూత‌.. 

Yaddanapudi-Sulochana
2018-05-21 10:15:55

తెలుగులో ఎన్నో అద్భుత‌మైన ర‌చ‌న‌లు చేసిన ఆ మ‌హా రచ‌యిత ఇక లేరు. తెలుగు సాహితీ రంగానికి తొలిత‌రం ర‌చ‌యిత‌ల్లో సుప్ర‌సిద్ధి గాంచిన య‌ద్ధ‌న‌పూడి సులోచనారాణి (79) క‌న్నుమూసారు. ర‌చ‌యితా రంగంలో లెజెండ్ అని పిల‌వ‌బ‌డే మ‌హిళా ర‌చ‌యిత‌గా ఆమెను అభివర్ణించవచ్చు. ఎన్నో మంచి ర‌చ‌నల‌తో స‌మాజంలోని చెడును ఎత్తి చూపిస్తూ.. మంచిని అవ‌లంబిస్తూ.. త‌న క‌థ‌ల్లో ఎక్కువ‌గా ఆత్మ‌విశ్వాసంతో కూడిన అమ్మాయిల‌ను చూపించేవారు య‌ద్ధ‌న‌పూడి. ఆమె రాసిన మీనా ఆధారంగానే అప్ప‌ట్లో మీనా సినిమా.. మొన్నీమ‌ధ్యే త్రివిక్ర‌మ్ అ..ఆ సినిమాలు వ‌చ్చాయి. ఆమె కొన్ని రోజులుగా అమెరికా కాలిఫోర్నియాలోని త‌న కూతురు ఇంట్లో ఉంటుంది. ఉన్న‌ట్లుండి ఆమె నిద్ర‌లోనే తుదిశ్వాస విడిచింది. ఈ విష‌యాన్ని ఆమె కూతురు స్వ‌యంగా క‌న్ఫ‌ర్మ్ చేసారు. ఎమెస్కో పబ్లిషర్ విజయ్ కుమార్ సులోచనరాణి అత్యధిక నవలలని ప్రచురించారు. య‌ద్ధ‌న‌పూడి మృతితో తెలుగు సాహితీరంగం విషాదంలో మునిగిపోయింది. 

యద్దనపూడి సులోచనారాణి కృష్ణా జిల్లా మొవ్వ మండలం కాజా గ్రామంలో 1940లో జన్మించారు. ఆమె వ‌యసు 78 సంవ‌త్స‌రాలు. చిన్న‌నాటి నుంచే ర‌చ‌న‌ల ప‌ట్ల ఆక‌ర్షితురాలై అక్క‌డే త‌న ప్ర‌తిభను చూపించారు య‌ద్ధ‌న‌పూడి. ఆమె రాసిన ఎన్నో క‌థ‌లు సినిమాలుగా కూడా వ‌చ్చాయి. ఆమె సినిమాల‌కు కూడా క‌థ‌లు అందించారు. ఆమె రాసిన నవలలు వెండితెరని కుదుపేసాయి.. సంచ‌ల‌నం సృష్టించాయి. ఆమె రచించిన అగ్ని పూలు, ఆహుతి, అమర హృదయం, రుతువులు నవ్వాయి, కలల కౌగిలి, ప్రేమ పీఠం, బహుమతి, బంగారు కలలు, మౌనతరంగాలు, మీనా వంటి నవలలు ఎప్పుడూ నిత్య‌నూత‌న‌మే. ఇవ‌న్నీ సినిమాలుగా కూడా వ‌చ్చాయి. మొత్తానికి ఆమె లేక‌పోయినా ఆమె క‌లం మాత్రం ఎప్పుడూ మ‌న మ‌ధ్యే ఉంటుంది. 
 

More Related Stories