English   

క‌సిగా చంపేస్తున్న య‌మీగౌత‌మ్..

yami goutham hot look
2018-06-07 10:33:55

యామీగౌత‌మ్.. ఈ భామ పేరు గుర్తుందా..? అల్లు శిరీష్ డెబ్యూ మూవీ గౌర‌వంలో హీరోయిన్. ఆ త‌ర్వాత త‌రుణ్ తో యుద్ధం.. నితిన్ తో కొరియ‌ర్ బాయ్ క‌ళ్యాణ్ సినిమాలు చేసింది ఈ బ్యూటీ. కానీ ఏం చేస్తాం.. తెలుగు సినిమాలు ఈ భామ‌కు అచ్చిరాలేదు. బాలీవుడ్ లో విక్కీడోన‌ర్ లాంటి స‌క్సెస్ ఫుల్ మూవీతో క్రేజ్ తెచ్చుకుంది. అంత‌కంటే ముందే ఫెయిల్ అండ్ ల‌వ్లీ యాడ్ తో మంచి ఇమేజ్ సొంతం చేసుకుంది యామీ. ద‌క్షిణాదిన ఈ భామ‌ను ప‌ట్టించుకోకపోయినా.. బాలీవుడ్ లో మాత్రం బాగానే లాక్కొస్తుంది యామీగౌత‌మ్. ఉన్న కొద్దోగొప్పో క్రేజ్ తో మంచి సినిమాల‌నే త‌న ఖాతాలో వేసుకుంటుంది.ఆ మ‌ధ్య బాలీవుడ్ లో అజయ్ దేవ్ గ‌న్ తో యాక్స‌న్ జాక్స‌న్.. వ‌రుణ్ ధావ‌న్ తో బ‌ద్ లాపూర్.. పుల్కిత్ స‌మ్రాట్ తో స‌న‌మ్ రే.. హృతిక్ రోష‌న్ తో కాబిల్ సినిమాలు చేసంది యామీ. అన్నింట్లోనూ అందాలు బాగానే ఆర‌బోసిన కూడా పెద్ద‌గా స్టార్ ఇమేజ్ అయితే రాలేదు. దాంతో చేసేదేం లేక ఇలా వీలు చిక్కిన‌ప్పుడ‌ల్లా ఫోటోషూట్ ల‌లో అందాల‌న్నీ ఆర‌బోస్తూనే ఉంది యామీ. ఎన్ని చేసినా ఇప్ప‌టి వ‌ర‌కు స్టార్ హీరోయిన్ ముచ్చ‌ట అయితే తీర‌లేదు. మ‌రి ఈ భామ కోరిక ఎప్పటికి తీరుతుందో చూడాలిక‌..!

More Related Stories