English   

కన్నడ హీరో ముందు తల దించుకున్న యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్..

KGF Saaho
2019-12-14 14:18:17

కన్నడ హీరో ముందు ప్రభాస్ తల దించుకోవడం ఏంటి.. ఆయన్ని ఎదుర్కోకపోవడం ఏంటి అనుకుంటున్నారా..? ఇప్పుడు ఇదే జరిగింది మరి. ప్రభాస్ అంటే ఇప్పుడు ఇండియన్ స్టార్. కానీ ఆయన కంటే తోపు మరో హీరో ఉన్నాడు. అతడే యశ్. ఈయన ఇప్పుడు ఇండియన్ వైడ్ గా దుమ్ము దులిపేస్తున్నాడు. యశ్ నటించిన కేజియఫ్ సినిమా సంచలనాలు రేపింది. థియేటర్స్ లో ఈ చిత్రం సృష్టించిన సంచలనాలకు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. ఇక అమెజాన్ లో కూడా ఈ చిత్రం రప్ఫాడించింది. ఏకంగా ప్రభాస్ సినిమాను సైతం వెనకబడేసింది కేజియఫ్. 2019లో ఎక్కువ వ్యూస్ దక్కించుకున్న సినిమాగా కేజియఫ్ లిఫ్టులో అగ్రస్థానంలో నిలిచింది. సాహో అన్ని భాషల్లోనూ ఎక్కువ వ్యూస్ దక్కించుకుందంటుంటే.. ఉత్తరాది ప్రేక్షకులు మాత్రం వార్ సినిమాపై మక్కువ ఎక్కువ చూపిస్తున్నారు. ఇక కన్నడ వాళ్లు మాత్రం కేజియఫ్ మా ధైర్యం అంటున్నారు. ఇలా ఎవరి భాష మీద వాళ్ళు తమ అభిమానాన్ని చాటుకుంటుంటే.. మరి కొంతమంది మాత్రం మోహన్ లాల్ లూసిఫర్ సినిమాపై ప్రేమ కురిపిస్తున్నారు. కానీ 'సాహో', 'కెజిఎఫ్' సినిమా వ్యూస్ విషయంలో మాత్రం ఫ్యాన్స్ హద్దులు దాటేసి మరీ నెట్టింట్లో రచ్చ చేస్తున్నారు. ఇదిలా ఉంటే అమెజాన్ ప్రైమ్ మాత్రం ఇంతవరకు సినిమాల వ్యూస్ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. కానీ అనధికార లెక్కల ప్రకారం మాత్రం సాహోను కేజియఫ్ దాటేసిందని తెలుస్తుంది.

More Related Stories