English   

సుమలతకు మద్దతుగా కేజీఎఫ్ హీరో !

Sumalatha
2019-03-19 11:46:48

కర్ణాటకలో అధికార కాంగ్రెస్-జేడీఎస్ కూటమికి షాక్ తగిలింది. మాండ్య లోక్‌సభ స్థానం నుంచి పొత్తుల్లో భాగంగా ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ బరిలోకి దిగుతుండగా, మాజీ మంత్రి అంబరీష్ భార్య సుమలత స్వతంత్ర అభ్యర్థిగా ఆయనపై పోటీకి దిగారు. మాండ్యా నియోజకవర్గంపై దశబ్దాలుగా కాంగ్రెస్‌ పార్టీదే ఆధిపత్యమని, అలాంటిది ఈ స్థానాన్ని జేడీఎస్‌కు అప్పగించడం నచ్చక ఆమె పోటీకి దిగుతున్నానని చెబుతున్నారు. కార్య కర్తలు, అభిమానుల డిమాండ్ మేరకు ఇండిపెండెంట్‌గా పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు సుమలత చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి మాండ్యా సీటును తమకు కేటాయించాలని జేడీఎస్ కోరగా, కాంగ్రెస్ నాయకత్వం అందుకు అంగీకారం తెలిపింది. దాంతో ముఖ్యమంత్రి కుమారస్వామి కుమారుడు నిఖిల్ గౌడ, జేడీఎస్ నుంచి బరిలో దిగారు. ఇది అంబ రీష్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలకు నచ్చలేదు, ఆ క్రమంలో సన్నిహితులతో చర్చించిన సుమలత, గత వారం బీజేపీ సీనియర్‌ నేత ఎంఎస్‌ కృష్ణతో సమావేశమై సమాలోచనలు జరిపారు. ఓ దశలో ఆమె బీజేపీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరిగినప్పటికీ చివరకు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయాలని సుమలత నిర్ణయించుకున్నారు. అయితే సుమ‌ల‌త‌కు అండ‌గా కేజీఎఫ్‌ హీరో య‌ష్‌, హీరో ద‌ర్శ‌న్ లు అండ‌గా నిలుస్తున్నారు. ఇటీవ‌ల నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఈ ఇద్ద‌రు సుమ‌ల‌త త‌రుపున మాండ్య‌లో ప్ర‌చారం చేస్తామ‌ని ఓపెన్‌ గా ప్రామిస్ చేయ‌డం క‌ర్ణాట‌క రాజ‌కీయాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. అంబ‌రీష్ బతికున్నప్పుడు య‌ష్ త‌న కుమారుడితో స‌మాన‌మ‌ని చాలా సంద‌ర్భాల్లో చెప్పారు. ఆ రుణం తీర్చుకోవాల‌న్న ఆలోచ‌న‌తోనే య‌ష్ లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో పోటీకి దిగుతున్న సుమ‌ల‌త‌కు అండ‌గా నిలుస్తున్నాడ‌ని క‌న్న‌డ మీడియా విశ్లేషిస్తోంది. వీరే కాక నిర్మాత రాక్ లైన్ వెంకటేష్‌తో పాటు ఇతర సినీ ప్రముఖులు సుమలతకు మద్దతు పలుకుతున్నారు. 

More Related Stories