English   

కేజీఎఫ్ స్టార్ కు జోడీగా మిల్కీ బ్యూటీ

 Tamanna
2021-06-21 12:31:23

శాండిల్ వుడ్ లో హీరో యష్ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఇక ఎప్పుడైతే కే జి ఎఫ్ విడుదలైందో అప్పటినుండి పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు .కే జి ఎఫ్ చాప్టర్ 2 చిత్రీకరణ పూర్తి అయినా కరోనా కాలం వల్ల విడుదలకు నోచుకోలేదు. దాంతో కే జి ఎఫ్ చాప్టర్ 2 సినిమా కోసం ఎంతో మంది వెయిట్ చేయాల్సిన ప‌రిస్తితి వ‌చ్చింది. ఇక యాష్ ఈ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడో అని సినిమా ప్రపంచం అంతా ఎదురుచూస్తోంది. దీనిపై ఎన్నో వార్తలు వచ్చినప్పటికీ ఏది కూడా అధికారికంగా ప్రకటించ బడలేదు. అలాంటి సమయంలోనే మరొక వార్త కూడా శాండల్ వుడ్ లో వినిపిస్తోంది. అది ఏంటంటే  దర్శకుడు నార్తన్ తో కలిసి యాష్ పనిచేయడానికి ఇష్ట పడుతున్నట్లు కోలీవుడ్ కథనాల ప్రకారం తెలుస్తోంది. 

ఈ సినిమాలో మిలటరీ ఆఫీసర్ గా య‌ష్ కనిపించే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో  యష్ కు జోడీగా తమన్నాను తీసుకునే ఉద్దేశంలో చిత్ర బృందం ఉన్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. తమన్నా కూడా కేవలం సౌత్ లోనే కాకుండా బాహుబలి ,సైరా లాంటి పాన్ ఇండియా చిత్రాల ద్వారా నార్త్ లోనూ తన పాపులారిటీని పెంచుకుంది. దాంతో ఇద్ద‌రు గుర్తింపు తెచ్చుకున్న‌ స్టార్స్ కలిసి నటించడం వల్ల తమ సినిమా క్రేజ్ ఎంతో పెరుగుతుందని దర్శకనిర్మాతలు ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ వార్త ఎంత వ‌ర‌కూ నిజమో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే. 

More Related Stories