English   

యాత్ర ఫస్ట్ డే కలెక్షన్స్ !

yatra movie  first day box office collections
2019-02-09 02:28:05

మహానేత వైఎస్ పాద యాత్ర ని యాత్ర పేరు తో బయోపిక్ గాని బయోపిక్ గా తెరకెక్కించి రీసెంట్ గా రిలీజ్ చేయగా సినిమా కి మంచి టాక్ మొదటి షో కే వచ్చింది, వైఎస్ అభిమానులు సహా ఆయన గురించి తెలియని వాళ్ళు సినిమా ని చూడటానికి మెల్లి మెల్లి గా థియేటర్స్ కి వస్తున్నారు, కానీ మొదటి రోజు కలెక్షన్స్ పరంగా మాత్రం సినిమా నిరాశ పరించిందనే చెప్పాలి. సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 13.4 కోట్లు కావడంతో బరిలోకి దిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆన్ లైన్ టికెట్ సేల్స్ మొదటి షో వరకు చాలా స్లో గా ఉండగా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షో లకు కూడా చాలా తక్కువ బుకింగ్స్ సాధించింది. అయితే సినిమా మీద మౌత్ టాక్ బాగానే ఉండటం తో వీకెండ్ లో సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పుంజుకునే అవకాశం అయితే గట్టిగానే ఉంది.  ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ద్వారా ఇప్పటికే లక్ష డాలర్లు వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాక ఈ సినిమా రాయలసీమ , కర్నూల్ , కడప , అనంతపూర్ లో ఈ సినిమా కి చాలా మంచి కలెక్షన్స్ ని రాబట్టిందని ట్రేడ్ వర్గాల  వారు అంటున్నారు. అలా ఈ సినిమా మొదటి రోజు 4 కోట్లను రాబట్టిందని అంటున్నారు.

More Related Stories