English   

యాత్రకు జగన్ దన్ను !

yatra movie team meet ysrcp chief ys jagan mohan reddy
2019-02-10 05:15:42

దివంగత  వైఎస్ రాజశేఖరరెడ్డి పాదయాత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర  సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. మార్నింగ్ షో నుంచే సినిమాకు మంచి మౌత్ టాక్ వచ్చింది. ఈ నేపధ్యంలో యాత్ర టీమ్‌ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని కలిసింది. చిత్ర దర్శకుడు మహి వి రాఘవ, నిర్మాత విజయ్‌ చల్లాలు వైఎస్‌ జగన్‌ను కలిసారు. ఈ నేపధ్యంలో తన తండ్రి మీద తీసిన సినిమా విజయం సాధించిన సందర్భంగా  జగన్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. అదే విధంగా రాజశేఖర రెడ్డి వ్యక్తిత్వాన్ని సినిమాగా తెరకెక్కించటంలో మీరు చూపించిన అభిరుచి, అకింతభావానికి కృతజ్ఞతలు, శుభాకాంక్షలు అంటూ వారిని అభినందిస్తూ జగన్ ఒక ట్వీట్ కూడా చేసారు. మమ్ముట్టి, రాజశేఖర్‌ రెడ్డి పాత్రలో నటించిన యాత్ర సినిమాని ఆనందో బ్రహ్మ ఫేం మహి వీ రాఘవ తెరకెక్కించాడు.  జగపతి బాబు ,పోసాని , అనసూయ , సుహాసిని , ఆశ్రిత ముఖ్య పాత్రలను పోషించారు. కృష్ణ కుమార్ సంగీతం అందించారు.

More Related Stories