English   

ఏడు చేపల కధ సినిమా రివ్యూ

review
2019-11-08 23:10:46

ఇటీవల కాలంలో అడల్ట్ కంటెంట్ సినిమాలు కూడా పెద్ద సంఖ్యలో వస్తున్నాయి. అర్జున్ రెడ్డి సినిమాతో మొదలయిన ఈ పరంపర ఏడు చేపల కధ దాకా వచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.  

కధ :
టెంప్ట్ రవి (అభిషేక్ రెడ్డి)కి థలసేమియా వ్యాధి. అతని ముందు ఎవరైనా ఎక్స్ పోజింగ్ చేస్తే అస్సలు తట్టుకోలేడు. థలసేమియా వ్యాధి వలన ముప్పై రోజులకో సారి రక్తం ఎక్కించుకోకపోతే చనిపోతాడు. అందుకోసం డోనర్ ని వెతుకుతూ ఉంటారు రవి అతనితో పాటు ఇదే జబ్బుతో బిగ్ బాస్ ఫేమ్ భానుశ్రీ మరో ముగ్గురు. వీళ్లంతా ఒకే గదిలో ఉంటారు. అయితే వాళ్ళంతా సెల్ ఫోన్స్ దొంగతనాలు చేసి తమకు కావాల్సిన రక్తాన్ని కొనుక్కుంటూంటారు. అయితే రవి మాత్రం దొంగతనం ఇష్టపడడు. రవి ఒక్కడే కష్టపడి పని చేయాలనుకుంటాడు.  రవి ఈ సమస్యలో ఉండగానే అతన్ని చూసి టెమ్ట్ అయ్యి ఆడవాళ్లు అతనికి దగ్గరకు వస్తూంటారు. ఇక సెల్ మెకానిక్‌గా పనిచేసే భావన (అయేషా సింగ్) టెంప్ట్ రవికి బ్లడ్ డొనేట్ చేసి సాయం చేస్తుంది. తను ఎవరో తెలియకుండానే సాయం చేసిన భావనను చూసి తొలి చూపులోనే ప్రేమలో పడతాడు టెంప్ట్ రవి. అయితే భావన ఆమెకు తెలియకుండానే ప్రెగ్నెంట్ అవుతుంది. ఆమె ప్రెగ్నెంట్ కావడానికి కారణం ఎవరో తెలియకపోవడంతో ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడుతుంది. ఇక్కడికే తికమకగా ఉంటె మరో పక్కన ఆత్మలతో టచ్ లో ఉంటూ..వాటిని కావాల్సిన వారిలో ప్రవేశపెట్టి తన కోరికలు తీర్చుకోవాలనుకునే సుందర్ అనే వ్యక్తి. ఇలా వీళ్లందరికీ ఒకరితో ఒకరికి తెలియని ఏదో తెలియని రిలేషన్  ఉంటుంది. ఆ చిక్కుముడి ఏమిటన్నది తెలియాలంటే  సినిమా చూడాల్సిందే.  

విశ్లేషణ
సినిమాలకు హర్రర్+కామెడీకి అడల్ట్  సీన్స్ పెట్టేస్తే పెట్టిన డబ్బులు వెనక్కి వచ్చేస్తాయని దర్శక నిర్మాతలు బలంగా నమ్ముతున్నారు. అందుకే అవసరం ఉన్నా లేకున్నా. బూతును సినిమాలో జొప్పించి మెప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బూతు ఉన్నా కామెడీ ఉన్నా అది కథకి తగ్గట్టుగా ఉండాలి.. సరైన స్క్రీన్ ప్లే ఉండాలి.. అప్పుడే సినిమా మెప్పిస్తుంది.  అలా కాకుండా ఇవేమి లేకుండా ఏవో కొన్ని సీన్స్ ని నమ్మి ఆధారపడి సినిమాను తీస్తే ఏడు చేపల కథలా మారిపోతుంది. ఈ సినిమా స్లో స్క్రీన్ ప్లే కథ చాలా నిదానంగా సాగింది.  ఇది సినిమాకు మైనస్ గా నిలిచింది.
నటీనటులు :
కామంతో టీజర్‌, ట్రైలర్‌లలో ఒక రేంజ్ లో రచ్చ రేపిన టెంప్ట్ రవి సినిమాలో మాత్రం ఇన్నోసెంట్‌గా కనిపించారు. తన మెచ్యూర్డ్ నటనతో ఆకట్టుకున్నాడు. కామెడీ పండించాడు. ఇక రాధ పాత్రలో నటించిన భాను శ్రీకి చాలా రోజుల తరువాత ఫుల్ లెంగ్త్ రోల్ లభించింది. అయితే ఎందుకో ఏమో కానీ అందాల ఆరబోతకు ఆమెను దూరంగానే ఉంచారు. కానీ ఒక సీన్‌లో భాగంగా భాను శ్రీకి శ్రీరెడ్డి గెటప్ వేసి  శ్రీరెడ్డి మాదిరి నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుని రోడ్డుపై బట్టలిప్పే సీన్ ఇరికించి పెద్ద ధైర్యమే చేశాడు దర్శకుడు. అలాగే ఏడు చేపలుగా కనిపించిన అమ్మాయిలెవరో తెలియకపోవడంతో వాళ్లను గుర్తించుకోవడం కష్టమే.
సాంకేతిక వర్గం :
దర్శకుడు అనుకున్న కంటెంట్ బాగానే ఉన్నప్పటికీ ప్రజెంటేషన్ మాత్రం తేడాపడింది. సెన్సార్ దెబ్బ పడిందో ఏమో కాని.. సీన్‌కి సీన్‌కి సంబంధంలేకుండా కథ నడిచేది. ఎవరు ఎందుకు వస్తున్నారో.. కథ ఏమైతుందో అనే కన్ఫ్యూజన్ క్రియేట్ చేశారు. ఆర్లి కెమెరా, కవి శంకర్ మ్యూజిక్ పర్వాలేదు.  నిర్మాణ విలువలు బాగున్నాయి.  
ఫైనల్ గా :
ఎక్కువ ఊహించుకుని వెళ్తే తప్పాదు నిరాశ

 

More Related Stories