English   

చరణ్, శామ్.. సంపేశారంతే.. 

Yentha-Sakkagunnave

ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ను ఊపేసిన పాటంటే రంగస్థలంలోని ఎంత సక్కగున్నావే పాటే. డే వన్ నుంచే టాప్ ట్రెండింగ్ లో నిలిచిన ఈ పాటకు అద్దిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ గా ప్రీ రిలీజ్ ఈవెంట్ తో రంగస్థలం బ్లాక్ బస్టర్ గ్యారెంటీ అనే ఇండికేషన్స్ పంపిన టీమ్ ఆ విషయాల్ని కన్ఫార్మ్ చేయడానికి రోజుకో సర్ ప్రైజ్ ఇస్తోంది. లేటెస్ట్ గా ఈ ఎంత సక్కగున్నావే పాటకు సంబంధించిన ఓ చిన్న వీడియో విడుదల చేశారు. అస్సలు ఈ పాట మైండ్ బ్లోయింగ్ అనే చెప్పాలి. లిరికల్ గా మెస్మరైజ్ చేసిన సాంగ్ విజువల్ గానూ విపరీతంగా ఆకట్టుకుంటోంది. సమంత, చరణ్ ల కెమిస్ట్రీ కానీ.. ఆ పాత్రల్ని వారు అడాప్ట్ చేసుకున్న విధానం కానీ హ్యాట్సాఫ్ అని చెప్పాల్సిందే. ఆ రేంజ్ లో ఉందీ వీడియో.. ఆ కాలంలో కూలి పని చేసుకునే ఓ సాధారణ అమ్మాయి ఎలా ఉంటుందో అచ్చం సమంత అలాగే ఉంది. మొక్క జొన్న చేలో పనిచేస్తూ చేలోనే భోజనం చేయడం, తోటి కూలీలతో కలిసి వెళుతుండటం, పొలం నుంచి వస్తున్నప్పుడు వంట చెరకు తీసుకురావడం, పొయ్యి ముందు కూర్చుని బియ్యం ఏరడం, గోదాట్లో పశువుల్ని కడగటం.. అచ్చం ఓ పల్లెభామను చూసినట్టే ఉంది. ఇక ఆ భామను చూసి మనసు పారేసుకున్న కుర్రాడిగా రామ్ చరణ్ సంపేశాడంతే.. అన్యమనస్కంగా పనిచేస్తూ.. మనసు మనసులో లేని కుర్రాడిలా గోదారి ఇసకలో దొర్లేయడం అబ్బో.. ఈ చిట్టిబాబు, రామలక్ష్మిల కెమిస్ట్రీకి బాక్సాఫీస్ బద్ధలయ్యలానే ఉంది.. 

More Related Stories