English   

మళ్ళీ అసిస్టెంట్ గా మారుతున్న యంగ్ డైరెక్టర్

Trivikram
2021-04-30 16:04:57

ఛలో సినిమాతో టాలీవుడ్ పరిచయమైన డైరెక్టర్ వెంకీ కుడుముల. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో వెంటనే యంగ్ హీరో నితిన్ తో భీష్మ ను తెరకెక్కించాడు. ఈ చిత్రం కూడా సూపర్ హిట్ గా నిలిచింది. ఇక ఈ సినిమా తరవాత వెంకీ బడా హీరోలతో సినిమా చేయబోతున్నాడని ఎన్నో గాసిప్ లు వచ్చాయి. అయితే ఇప్పటివరకు సినిమా పట్టాలెక్కలేదు..ప్రాజెక్టు అనౌన్స్ చేయలేదు. అయితే తాజా సమాచారం ప్రకారం ఈ దర్శకుడు మళ్లీ అసిస్టెంట్ డైరెక్టర్ గా మారుతున్నారట.

అదేంటి ఎవరైనా అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా ఎదిగి ఆ తరవాత స్టార్ డైరెక్టర్ అవ్వాలనుకుంటారు. కానీ వెంకీ డిఫరెంట్ గా ఉన్నాడనుకుంటున్నారా.? అయితే వెంకీ కుడుముల మళ్ళీ అసిస్టెంట్ గా మారబోతుంది అలానే సెటిల్ అవ్వడానికి కాదండి. తన గురువు త్రివిక్రమ్ కోసం అసిస్టెంట్ అవతారం ఎత్తబోతున్నారు. త్వరలో మహేష్ బాబు తో త్రివిక్రమ్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకోసం మాటల మాంత్రికుడు స్క్రిప్ట్ వర్క్ ను పూర్తి చేస్తున్నారు. అయితే స్క్రిప్ట్ వర్క్ లో వెంకీ త్రివిక్రమ్ కు సహాయం చేస్తారట. అంతే కాకుండా సినిమా షూటింగ్ సమయంలోను వెంకీ అసిస్టెంట్ గా వ్యవహరించబోతున్నారట. ఇదిలా ఉండగా గతంలోనూ వెంకీ త్రివిక్రమ్ సినిమాలకు అసిస్టెంట్ గా వర్క్ చేసాడు.

More Related Stories