టాలీవుడ్ లో ఘాటు ప్రేమాయణం..

ఇండస్ట్రీ అన్న తర్వాత ఎఫైర్లు కామన్. ఇక్కడ అంతా ఓపెన్ సిస్టమ్. అందరికి తెలిసినా కూడా తెలియనట్లే ఉంటారు. ఎప్పుడు ఎవరితో ఉంటారో.. ఎఫైర్ నడుపుతుంటారో ఎవరికీ తెలియదు అనుకుంటారు కానీ అన్నీ తెలుస్తూనే ఉంటాయి. ఇప్పుడు కూడా టాలీవుడ్ లో ఓ హీరో హీరోయిన్ మధ్య ఘాటు ప్రేమాయణం నడుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ కుర్ర హీరో నాలుగేళ్ల కింద ఇండస్ట్రీకి వచ్చాడు. స్టార్ వారసుడు కాకపోయినా వరసగా స్టార్ హీరోయిన్లతో సినిమాలు చేస్తున్నాడు.. భారీ సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. విజయాలు లేకపోయినా వరస సినిమాలు మాత్రం కమిట్ అవుతూనే ఉన్నాడు. ఇలాంటి కుర్ర హీరో ఇప్పుడు ఓ స్టార్ హీరోయిన్ తో ప్రేమాయణం నడుపుతున్నాడనే వార్తలు ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్నాయి. వీళ్ల ఎఫైర్ గురించి తెలిసిన వాళ్లు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారంతే. వయసులో తనకంటే చాలా పెద్దదైన ఆ ముద్దుగుమ్మతో ఈ కుర్ర హీరో బాగానే ఎంజాయ్ చేస్తున్నాడనే వార్తలు బ్రహ్మాండంగా బయటికి వస్తున్నాయి.
ఓ సీనియర్ హీరోయిన్ తో ఇప్పుడు కుర్ర బంగారం బాగానే ఎఫైర్ నడుపుతూ ఫారెన్ ట్రిప్పులకు కూడా తీసుకెళ్తున్నాడని తెలుస్తుంది. పైగా దుబాయ్ లాంటి దేశాల్లో క్రూజ్ లు ఎక్కించి.. స్పెషల్ ట్రీట్ కూడా ఇప్పిస్తున్నాడని.. అడిగిందే తడువు ఆ భామకు అన్నీ సమకూరుస్తున్నాడని ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు ఈ ఇద్దరి ప్రేమాయణమే టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారుతుంది. ఇంకా విచిత్రం ఏంటంటే ఒక్క సినిమా అంటే ఏమో అనుకోవచ్చు కానీ ఇప్పుడు వరసగా రెండు సినిమాలు ఆ భామతోనే చేస్తున్నాడు.. పైగా మరో సినిమా కూడా చేయడానికి రెడీ అవుతున్నాడు. అంతగా అల్లుకుపోయారు ఆ ఇద్దరూ. అంతేకాదు.. సిటీలోనే ఓ ఐదు నక్షత్రాల హోటల్లో ఎప్పుడూ ఆ భామకు స్పెషల్ రూమ్ కూడా బుక్ చేసి ఉంటుందని.. ఇదంతా తెలిసి కూడా కొందరు కామ్ గానే వేడుక చూస్తున్నారని తెలుస్తుంది. ఎంతైనా ఇండస్ట్రీ కదండీ.. ఆ మాత్రం ఫ్రీడమ్ ఉంటుందిలే. అయితే ఈ ప్రేమాయణం ప్రేమతోనే ఆగిపోతుందో లేదంటే పెళ్లి వరకు వెళ్తుందా అనేది చూడాలి.