English   

యాత్రను మెచ్చిన విజయమ్మ !

YS-VIjayamma
2019-02-11 20:00:20

2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన పాదయాత్రను ఆధారంగా చేసుకొని యాత్ర సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.  ఇటీవలే విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్‌ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతుంది. అయితే ఇటీవలే సినిమా యూనిట్‌ ను వైఎస్ జగన్ అభినందించిన సంగతి తెలిసిందే. తాజాగా ప్రసాద్ ల్యాబ్ లో యాత్ర సినిమా చూసిన అనంతరం రాజశేఖర్ రెడ్డి సతీమణి విజయమ్మ అభినందించారు. యాత్ర సినిమాను చాలా బాగా తీశారనీ, రాజశేఖర్ రెడ్డి పాదయాత్రను యాత్ర రూపంలో తెరకెక్కించిన తీరు చాలా బాగుందని అఆమే పేర్కొన్నారు. ఆయన సజీవంగా మన లేకపోయినా యాత్ర సినిమా ద్వారా ఆయనను మరోసారి మనముందుకు తీసుకువచ్చారని విజయమ్మ అన్నారు. రాజశేఖర్ రెడ్డి వ్యక్తిత్వాన్ని, ఆశయాలను, రాజకీయ జీవితాన్ని మరో సారి ప్రజలకు కళ్ళకు కట్టినట్లు చూపించారని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను రాజశేఖర్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేశారనీ, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఇచ్చిన మాట కోసంరాజశేఖర్ రెడ్డి కట్టుబడేవారని ఆమె తెలిపారు. రాజశేఖర్ రెడ్డిని ప్రజలందరూ ఆదరించారని, ఆయన అనతరం పిల్లలను కూడా ప్రజలు ఆదరిస్తున్నందుకు ఆమె ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు మహి వి రాఘవ్ కు, నిర్మాతలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. దర్శకనిర్మాతలు ఆమెను దగ్గరుండి సినిమా చూపించి పంపారు.

More Related Stories