English   

మళ్ళీ లైన్ లోకి వైవీఎస్ చౌదరి !

YVS Chowdary to direct love back drop movie
2019-02-04 20:35:56

`రేయ్` డిజాస్ట‌ర్‌ తో అసలు ఉన్నాడా లేదా అన్నట్టు అయిపోయాడు వైవిఎస్ చౌద‌రి. లాహిరిలాహిరి, దేవదాసు చిత్రాలు ఆయనకు మంచి పేరు తెచ్చాయి. అయితే.. ఆమధ్య వచ్చిన 'రేయ్‌' సినిమా పెద్దగా లాభం లేకుండా పోయింది. హీరోకు ఇంట్రడక్షన్‌ గా పనికి వచ్చింది కానీ మెగా కాంపౌండ్‌ నుంచి ఆయనకు మరే హీరో డేట్స్‌ కూడా ఇవ్వలేదు. ఈ సినిమాతో వైవిఎస్ దాదాపుగా రూ.20 కోట్లు దాకా న‌ష్ట‌పోయాడ‌ని, ఆస్తులు కూడా అమ్ముకోవాల్సివ‌చ్చింద‌ని గతేడాది అయితే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడని టాలీవుడ్‌ లో గుస‌గుస‌లు వినిపించాయి. దాంతో వైవిఎస్ పనయిపోయింది ఇక సినిమాలు తీయ‌డం మానేశాడ‌నుకున్నారంతా. కానీ ఆయన ఓ సినిమాని తెర‌కెక్కించేందుకు రంగం సిద్ధం చేసేసుకున్నారని సమాచారం. త్వ‌ర‌లోనే మళ్ళీ వైవిఎస్ మెగాఫోన్ ప‌ట్ట‌బోతున్నాడ‌ని దానికోసం ఇప్ప‌టికే ఓ లవ్ స్టోరీని సిద్ధం చేశాడ‌ని అంటున్నారు. పాత వాళ్ళు అయితే బడ్జెట్ పెరుగుతుందని ఈ సినిమాతో కొత్త‌వాళ్ల‌తో  కానిస్తున్నాడని  టాక్‌. అయితే మరి ఈ సినిమా తన ప్రొడక్షన్ అయిన బొమ్మరిల్లులోనే నిర్మిస్తాడా? లేదంటే నిర్మాత ఎవ‌రైనా ఉన్నారా? అనేది తేలాల్సి వుంది. కొత్త‌వాళ్ల‌తో ఎప్పుడు సినిమా చేసినా వైవిఎస్ హిట్లు కొట్టాడు. ఒక్క ధరం తేజ్ విషయం లో తప్ప. ఈసారీ అలానే కొత్త హీరోని, కొత్త హీరోయిన్‌ని ఎంచుకోవాల‌ని చూస్తున్నాడని అంటున్నారు.

More Related Stories